Mayabazar

From Panglossa Wiki
Jump to navigation Jump to search
శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా.

వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా చిన్నారి శశిరేఖ వర్దిల్లవమ్మా.


సకల సౌభాగ్యవతి రేవతీదేవి తల్లినై దయనెల్ల వెల్లివిరియగను.

అడుగకే వరములిడు బలరామదేవులే జనకులై కోరిన వరములియ్యగను.


శ్రీకళల విలసిల్లు రుక్మిణీదేవి పినతల్లియై నిన్ను గారాముచాయ.

అఖిల మహిమలు కలుగు కృష్ణపరమాత్ములే పినతండ్రియై సకల రక్షణనుచాయ.


ఘనవీర మాతయగు శ్రీ సుభద్రాదేవి మేనత్తయై నిన్ను ముద్దుచాయగను.

పాండవాల్లుల రాజు బాలుడభిమన్యుడే బావయై నీ రతన లోకమని మురియ