Language Checklist/తెలుగు

From Panglossa Wiki
Jump to navigation Jump to search
Other languages:

Language Checklist v. 0.1 - తెలుగు

  1. మీరు విద్యార్థివా?
    1. అవును, నేను విద్యార్థిని.
    2. కాదు, నేను విద్యార్థిని కాదు.
  2. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను?
    1. నువ్వు ఇప్పుడు బడికి వెళ్తున్నావు.
    2. నువ్వు పనికి వెళ్లడం లేదు.
  3. అతను మనతో ఏమి చెబుతున్నాడు?
    1. అతను నాతో మంచి విషయాలు చెబుతున్నాడు.
    2. అతను నీతో చెడ్డ విషయాలు చెప్పలేదు.
  4. విజ్ఞానశాస్త్రం గురించి అంతా ఎవరికి తెలుసు?
    1. ఆమెకు విజ్ఞానశాస్త్రం గురించి అంతా తెలియదు.
    2. కానీ ఆమెకు చరిత్ర గురించి అంతా తెలుసు.
  5. అది ఎలా కనిపించింది?
    1. అది అంత బాగా కనిపించలేదు.
    2. నిజానికి, అది చాలా దారుణంగా కనిపించింది.
  6. మీరు ఆ పుస్తకాలన్నీ ఏం చేశారు?
    1. మేము ఆ పుస్తకాలను ఎవరికీ అమ్మలేదు.
    2. మేము ఆ పుస్తకాలను పిల్లలకు ఇచ్చేశాము.
  7. ఆ అబ్బాయి ఆ సినిమాను అప్పటికే ఎన్నిసార్లు చూసి ఉంటాడు?
    1. ఆ అబ్బాయి ఆ సినిమాను అప్పటికే చాలాసార్లు చూసి ఉంటాడు.
    2. ఆ అబ్బాయి ఆ సినిమాను ఒక్కసారి మాత్రమే చూసి ఉండడు.
  8. వాళ్ళు అక్కడ ఏం చేస్తారు?
    1. బహుశా మనకు ఒక మేలు చేస్తారు.
    2. వాళ్ళు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టరు.
  9. మీ స్నేహితుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు?
    1. నా స్నేహితుడు తప్పకుండా తన కుటుంబంతో ఇంట్లోనే ఉండాలనుకుంటాడు.
    2. నా స్నేహితుడు మీతో బయటకు వెళ్లాలనుకోడు.
  10. రేపు నేను ఏమి చేయాలి?
    1. రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి.
    2. నువ్వు రాత్రంతా చదువుకోకూడదు.
  11. 'ఆ వ్యక్తి గదిని ఎప్పుడు విడిచి వెళ్ళాలి?
    1. ఆ వ్యక్తి గదిని వెంటనే విడిచి వెళ్ళాలి.
    2. ఆ వ్యక్తి మన సంభాషణను వినడం కొనసాగించకూడదు.
  12. కుక్క ఎంత వేగంగా పరిగెత్తగలదు?
    1. కుక్క చాలా వేగంగా పరిగెత్తగలదు.
    2. కానీ కుక్క కారు కంటే వేగంగా పరిగెత్తలేదు.
  13. ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి ప్రజలు ఏమి చేయగలరు?
    1. ప్రజలు ఎల్లప్పుడూ నిజం మాట్లాడగలరు.
    2. ప్రజలు అన్నివేళలా అబద్ధాలు చెప్పకుండా ఉండగలరు.
  14. ఈ పుస్తకానికి ఏమైనా అవసరం అని మీకు అనిపిస్తుందా?
    1. అవును, ఈ పుస్తకానికి కొత్త అట్ట అవసరం అని నాకు అనిపిస్తుంది.
    2. లేదు, ఈ పుస్తకానికి ఏమీ అవసరం అని నాకు అనిపించడం లేదు.
  15. నా పిల్లలు ఎందుకు దాక్కుంటున్నారు?
    1. ఎందుకంటే మీ పిల్లలకు ఒక రహస్యం ఉండవచ్చు.
    2. వారు దాని గురించి ఎవరికీ చెప్పాలనుకోకపోవచ్చు.
  16. పార్టీకి తాగడానికి సరిపడా ఉన్నాయా?
    1. అవును, అన్నీ పుష్కలంగా ఉన్నాయి.
    2. లేదు, ఎవరో ఒకరు దుకాణం నుండి కొన్ని బీరులు తీసుకురావాలి.
  17. సినిమా ఎప్పుడు మొదలవుతుంది?
    1. సినిమా తొందరగా మొదలవ్వదు.
    2. సినిమా రాత్రి పది గంటలకు మొదలవుతుంది.
  18. మా అమ్మకి ఏ బహుమతి కొనాలి?
    1. మీరు మీ అమ్మకి ఆ అందమైన ఉంగరాన్ని కొనాలి.
    2. మీరు ఆ అసహ్యమైన బట్టలు కొనకూడదు.
  19. మీ నాన్నగారి వయసెంత?
    1. మా నాన్నగారికి అంత వయసు లేదు.
    2. మా నాన్నగారికి నలభై తొమ్మిది సంవత్సరాల వయస్సు.
  20. ఈ కారు ధర ఎంత అవుతుంది?
    1. దీనికి ఏమీ ఖర్చు అవ్వదు.
    2. ఇది కంపెనీ నుండి బహుమతి.