Language Checklist/తెలుగు
Jump to navigation
Jump to search
Language Checklist v. 0.1 - తెలుగు
- మీరు విద్యార్థివా?
- అవును, నేను విద్యార్థిని.
- కాదు, నేను విద్యార్థిని కాదు.
- నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను?
- నువ్వు ఇప్పుడు బడికి వెళ్తున్నావు.
- నువ్వు పనికి వెళ్లడం లేదు.
- అతను మనతో ఏమి చెబుతున్నాడు?
- అతను నాతో మంచి విషయాలు చెబుతున్నాడు.
- అతను నీతో చెడ్డ విషయాలు చెప్పలేదు.
- విజ్ఞానశాస్త్రం గురించి అంతా ఎవరికి తెలుసు?
- ఆమెకు విజ్ఞానశాస్త్రం గురించి అంతా తెలియదు.
- కానీ ఆమెకు చరిత్ర గురించి అంతా తెలుసు.
- అది ఎలా కనిపించింది?
- అది అంత బాగా కనిపించలేదు.
- నిజానికి, అది చాలా దారుణంగా కనిపించింది.
- మీరు ఆ పుస్తకాలన్నీ ఏం చేశారు?
- మేము ఆ పుస్తకాలను ఎవరికీ అమ్మలేదు.
- మేము ఆ పుస్తకాలను పిల్లలకు ఇచ్చేశాము.
- ఆ అబ్బాయి ఆ సినిమాను అప్పటికే ఎన్నిసార్లు చూసి ఉంటాడు?
- ఆ అబ్బాయి ఆ సినిమాను అప్పటికే చాలాసార్లు చూసి ఉంటాడు.
- ఆ అబ్బాయి ఆ సినిమాను ఒక్కసారి మాత్రమే చూసి ఉండడు.
- వాళ్ళు అక్కడ ఏం చేస్తారు?
- బహుశా మనకు ఒక మేలు చేస్తారు.
- వాళ్ళు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టరు.
- మీ స్నేహితుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు?
- నా స్నేహితుడు తప్పకుండా తన కుటుంబంతో ఇంట్లోనే ఉండాలనుకుంటాడు.
- నా స్నేహితుడు మీతో బయటకు వెళ్లాలనుకోడు.
- రేపు నేను ఏమి చేయాలి?
- రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి.
- నువ్వు రాత్రంతా చదువుకోకూడదు.
- 'ఆ వ్యక్తి గదిని ఎప్పుడు విడిచి వెళ్ళాలి?
- ఆ వ్యక్తి గదిని వెంటనే విడిచి వెళ్ళాలి.
- ఆ వ్యక్తి మన సంభాషణను వినడం కొనసాగించకూడదు.
- కుక్క ఎంత వేగంగా పరిగెత్తగలదు?
- కుక్క చాలా వేగంగా పరిగెత్తగలదు.
- కానీ కుక్క కారు కంటే వేగంగా పరిగెత్తలేదు.
- ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి ప్రజలు ఏమి చేయగలరు?
- ప్రజలు ఎల్లప్పుడూ నిజం మాట్లాడగలరు.
- ప్రజలు అన్నివేళలా అబద్ధాలు చెప్పకుండా ఉండగలరు.
- ఈ పుస్తకానికి ఏమైనా అవసరం అని మీకు అనిపిస్తుందా?
- అవును, ఈ పుస్తకానికి కొత్త అట్ట అవసరం అని నాకు అనిపిస్తుంది.
- లేదు, ఈ పుస్తకానికి ఏమీ అవసరం అని నాకు అనిపించడం లేదు.
- నా పిల్లలు ఎందుకు దాక్కుంటున్నారు?
- ఎందుకంటే మీ పిల్లలకు ఒక రహస్యం ఉండవచ్చు.
- వారు దాని గురించి ఎవరికీ చెప్పాలనుకోకపోవచ్చు.
- పార్టీకి తాగడానికి సరిపడా ఉన్నాయా?
- అవును, అన్నీ పుష్కలంగా ఉన్నాయి.
- లేదు, ఎవరో ఒకరు దుకాణం నుండి కొన్ని బీరులు తీసుకురావాలి.
- సినిమా ఎప్పుడు మొదలవుతుంది?
- సినిమా తొందరగా మొదలవ్వదు.
- సినిమా రాత్రి పది గంటలకు మొదలవుతుంది.
- మా అమ్మకి ఏ బహుమతి కొనాలి?
- మీరు మీ అమ్మకి ఆ అందమైన ఉంగరాన్ని కొనాలి.
- మీరు ఆ అసహ్యమైన బట్టలు కొనకూడదు.
- మీ నాన్నగారి వయసెంత?
- మా నాన్నగారికి అంత వయసు లేదు.
- మా నాన్నగారికి నలభై తొమ్మిది సంవత్సరాల వయస్సు.
- ఈ కారు ధర ఎంత అవుతుంది?
- దీనికి ఏమీ ఖర్చు అవ్వదు.
- ఇది కంపెనీ నుండి బహుమతి.